చెన్నూరు కెసి కెనాల్ బ్రిడ్జి క్రింద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
- EDITOR

- Nov 20
- 1 min read
చెన్నూరు కెసి కెనాల్ బ్రిడ్జి క్రింద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం


వైయస్సార్ కడప జిల్లా
చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇర్కాన్ సర్కిల్ వద్ద కేసీ కెనాల్ బ్రిడ్జి క్రింద ఒక గుర్తు తెలియని ఆడమనిషి మృతదేహం ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో అలంఖానపల్లె విఆర్ఓ సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు మహిళ సుమారు మూడు వారాల క్రితం చనిపోయినట్లు భావిస్తున్నారు, మహిళ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఒంటిపై ముక్కుపుడక, రెండు చేతులకు ఎరుపు రంగు మట్టి గాజులు అలాగే కాళ్లకు వెండి పట్టీలు ఉన్నాయని చెన్నూరు సిఐ తెలిపారు. పొందుపరిచిన ఆధారాలతో మృతి చెందిన మహిళను గుర్తించిన ఎడల చెన్నూరు సిఐ ను (9121100519) సంప్రదించాలని వారు కోరారు. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.









Comments