top of page

అంగరంగ వైభవంగా ఉమామహేశ్వర స్వామి కళ్యాణం

  • Writer: EDITOR
    EDITOR
  • May 11, 2023
  • 1 min read

అంగరంగ వైభవంగా ఉమామహేశ్వర స్వామి కళ్యాణం

అలంకరణలో ఉమా మహేశ్వరులు
ree

కళ్యాణ మహోత్సవానికి హాజరైన

ఎమ్మెల్యే మేడా, జడ్పీ చైర్మన్, బత్యాల


ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


మండల కేంద్రంలోని మందరం రాచపల్లి గ్రామంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి కుంభాభిషేకం నిర్వహించారు. అంతకుముందుగా విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణోత్సవాన్ని వేద పండితులు మంగళహారతులు, మంత్రోచ్ఛారణాలు, మంగళ వాయిద్యాలు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ree

గ్రామానికి చెందిన సంపతి ఉమాపతి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణమహోత్సవానికి రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు లతోపాటు పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రముఖులు, అధికారులు, అనధికారులు, మందరం గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలతోపాటు రాజంపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించి పరవశించారు. కళ్యాణ అనంతరం భక్తులందరికీ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. దీంతో మందరం రాచపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ree

ఈ కార్యక్రమంలో మందరం గ్రామపంచాయతీ వైసిపి నాయకులు తంబెళ్ళ వేణుగోపాల్ రెడ్డి, వెలగచర్ల గంగిరెడ్డి, అత్తిరాల ఆలయ చైర్మన్ వెలగచర్ల వెంకటసుబ్బారెడ్డి లతోపాటు తెలుగుదేశం నాయకులు మండల పార్టీ అధ్యక్షులు గన్నే సుబ్బ నరసయ్య, డి ఆర్ ఎల్ మణి, కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page