top of page

ఇకపై ఆధార్ కార్డుపై ఫోటో, క్యూఆర్ కోడ్‌ మాత్రమే.. UIDAI కొత్త సేఫ్టీ చర్యలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 21
  • 1 min read

ఇకపై ఆధార్ కార్డుపై ఫోటో, క్యూఆర్ కోడ్‌ మాత్రమే.. UIDAI కొత్త సేఫ్టీ చర్యలు

ree

త్వరలో ఆధార్ కార్డులు పూర్తిగా కొత్త సేఫ్టీ ఫీచర్లతోఅందుబాటులోకి రాబోతున్నాయి. ఇది ప్రజల వ్యక్తిగత వివరాల దుర్వినియోగాన్ని నివారించడంతో పాటు ఆఫ్‌లైన్ ధృవీకరణను తగ్గించేందుకు ఆధార్ కార్డుపై కేవలం వ్యక్తి ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంచే ప్రతిపాదనను UIDAI పరిశీలిస్తోంది. ఫోటో, QR కోడ్ తప్ప మరేమీ అవసరం లేదని భావిస్తున్నట్లు UIDAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భువనేశ్ కుమార్ తెలిపారు. వివరాలు ప్రింట్ చేసి ఉండటం వల్ల అవి దుర్వినియోగానికి గురవుతున్నాయని చెప్పారు.


UIDAI డిసెంబర్ నుంచి వయస్సు ధృవీకరణ విధానాలను బలోపేతం చేయడంతో పాటు హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు వంటి వారు ఆధార్ కార్డు కాపీలను తీసుకోవడం లేదా ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేయడం నిషేధించే కొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. ఆధార్ కేవలం ఆథెంటికేషన్ కోసం మాత్రమేనని కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఆధార్ చట్టం ప్రకారం బయోమెట్రిక్ డేటా లేదా ఆధార్ నంబర్‌ను ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం ఉపయోగించడం, భద్రపరచడం నిషేధించబడింది. అయినప్పటికీ చాలా సంస్థలు ఇంకా ఆధార్ ప్రతులను ఉంచుకుంటున్నాయి. దీనికోసమే ఆధార్ యాప్ రాబోతోంది.

ree

కొత్త చర్యలతో ఫోటో కాపీలు ఇవ్వడం లేదా ఫిజికల్ ఆధార్ కాపీలపై ఆధారపడడం తగ్గుతుందని UIDAI డీడీజీ వివేక్ చంద్ర వర్మ వివరించారు. ఈ యాప్‌లో ఒకే ఫ్యామిలీలో ఉన్న ఐదు మంది వరకు ఆధార్ వివరాలను చూడగలిగే అవకాశం, ఏ వివరాలు పంచుకోవాలో వినియోగదారుడి నియంత్రణలో ఉంచే ఫీచర్లు ఉన్నాయి. అందువల్ల ఒక క్లిక్‌తో బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉండనున్నాయి. అలాగే మొబైల్ నంబర్, అడ్రెస్ అప్డేట్ చేయడం కూడా మరింత సులభం కానుంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page