టైక్వాండో లో బంగారు పథకాల విజేతలను సన్మానించిన కొరముట్ల.
- DORA SWAMY

- Jun 15, 2022
- 1 min read
టైక్వాండో విజేతలను సన్మానించిన ప్రభుత్వవిప్ కొరముట్ల.

ఈరోజు సాయంత్రం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు వైఎస్ఆర్ సీపీ కార్యాలయం నందు...ఇటీవల గుంటూరులో జరిగిన తైక్వాండో పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన 11 మంది విద్యార్థులను, ఎస్కే స్పోర్ట్స్ క్లబ్ కోచ్ మౌలాను ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు. ఆటల ద్వారా నియోజకవర్గానికి పేరు తేవడం గర్వంగా ఉందని భవిష్యత్తులో మరింతగా ఎదగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేతల గురించి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, మండల కన్వీనర్ సుధాకర్ రాజు, ఉప సర్పంచ్ తోట శివ సాయి తదితరులు పాల్గొన్నారు.








Comments