16కు చేరిన టిడిపి కౌన్సిలర్ల సంఖ్య
- PRASANNA ANDHRA

- Oct 1, 2024
- 1 min read
16కు చేరిన టిడిపి కౌన్సిలర్ల సంఖ్య

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. తాజాగా మంగళవారం ఉదయం వైసిపి మున్సిపల్ కౌన్సిలర్లు ఇరువురు ఆ పార్టీని వీడి నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి కండువా కప్పుకున్నారు. వైసీపీని వీడిన మున్సిపల్ వార్డు కౌన్సిలర్ లలో 38వ వార్డు కౌన్సిలర్ రమాదేవి, 14వ వార్డు కౌన్సిలర్ జిలాని భాష ఉన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు ఎమ్మెల్యే వరద, టిడిపి రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు, వి.ఎస్ ముక్తియర్, సమక్షంలో టిడిపిలో చేరగా, రానున్న రోజుల్లో మరి కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి టిడిపిలోకి చేరనున్నట్లు తెలియవస్తోంది. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరినట్లు, తమ వార్డులలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎమ్మెల్యే వరద కృషి చేస్తున్న కారణంగా తాము టిడిపి వైపు మొగ్గు చూపినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, పలువురు ముఖ్య టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









Comments