top of page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jun 28, 2022
  • 1 min read

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి బలమైన గాయాలు

ree

రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయిన ఘటన మంగళవారం మైదుకూరు - ప్రొద్దుటూరు ప్రధాన రహదారిపై జరిగింది. కావలి కొత్తసత్రానికి చెందిన ఆరుగురు గోవాకు కారులో బయలుదేరారు. కాలకృత్యాల కోసం ఏటూరు కాలువ వద్ద కారు ఆపి రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టింది. ఈ సంఘటనలో వినయ్ కుమార్‌, అశోక్‌ కుమార్‌ లకు బలమైన గాయాలయ్యాయి. వీరిని 108 లో పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాపాడు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page