top of page

చిట్వేలి మండల చిరంజీవి యువత అధ్యక్షులుగా తుపాకుల పెంచలయ్య.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 20, 2022
  • 1 min read

చిట్వేలి మండల చిరంజీవి యువత అధ్యక్షులుగా తుపాకుల పెంచలయ్య.


ree

చిట్వేలి మండల చిరంజీవి యువత అధ్యక్షులుగా గట్టుమీద పల్లి గ్రామానికి చెందిన చిరంజీవి అభిమాని జనసేన నాయకుడు తుపాకుల పెంచలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై చెప్పినవన్నీ తూచా తప్పకుండా నిర్వహిస్తున్న తుపాకుల పెంచలయ్య ను ఏకగ్రీవంగా నియమిస్తూ చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామి నాయుడు ఆదేశాలు మేరకు కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు రంజిత్ కుమార్ ఎన్నుకున్నారు.


తుపాకుల పెంచలయ్య మాట్లాడుతూ... మెగా ఫ్యామిలీకి, జనసేన పార్టీకి ఎల్లవేళలా తోడుగా ఉంటానని అన్నారు. నన్ను గుర్తించి చిరంజీవి యువత చిట్వేలి మండలం అధ్యక్షునిగా నియమించినందుకు గౌరవ అధ్యక్షులు మెగా బ్రదర్ నాగబాబుకి, అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామి నాయుడు కి, ఫైర్ బ్రాండ్ తాతంశెట్టి నాగేంద్ర కి, రాష్ట్ర అధ్యక్షులు భవాని రవికుమార్ కి,జిల్లా అధ్యక్షులు పండ్ర రంజిత్ కి, మాదాసు నరసింహ లకు కృతజ్ఞతలు తెలిపారు.


తమకు ఇచ్చినటు వంటి బాధ్యతను నిర్వహిస్తూ అభిమాన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తుపాకుల పెంచలయ్య తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page