ఆదివారం గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్
- PRASANNA ANDHRA

- 9 minutes ago
- 1 min read
ఆదివారం గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రీన్ హార్ట్‌ఫుల్‌నెస్ రన్‌ను డిసెంబర్ 14, ఆదివారం ఉదయం ప్రొద్దుటూరులో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు & క్రీడాశాఖ, ఫిట్ ఇండియా, ఫారెస్ట్స్ బై హార్ట్‌ఫుల్‌నెస్ మద్దతుతో ఈ కార్యక్రమం జరుగుతోంది. శ్రీరామచంద్ర మిషన్ (హార్ట్‌ఫుల్‌నెస్), రోటరీ క్లబ్, రోటరీ ఐ హాస్పిటల్, ప్రొద్దుటూరు మిడ్‌టౌన్ రోటరీ క్లబ్ ఈ రన్‌కు భాగస్వామ్య సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడటం, వృక్ష సంరక్షణకు ప్రోత్సాహం కల్పించాలనే లక్ష్యంతో ఈ రన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. 2 కిలోమీటర్ల రన్ ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ నుంచి ప్రారంభమై, టీ.బీ. రోడ్ మార్గంగా శివాలయం సర్కిల్ వద్ద ముగియనుంది. ఉదయం 6:30 గంటలకు రన్ ప్రారంభం అవుతుంది అని తెలిపారు. పాల్గొనే వారికి అల్పాహారం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఆన్లైన్ నమోదు కోసం ప్రత్యేకంగా లింక్‌ను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ రన్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో పర్యావరణ మిత్ర అవార్డు గ్రహీత ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గజ్జల వెంకటేశ్వర్ రెడ్డి, హార్ట్ ఫుల్ నెస్ ట్రైనర్ సి రాజశేఖర్, మిడ్ టౌన్ రోటరీ ప్రెసిడెంట్ ఉట్టి తిరుపతయ్య, మిడ్ టౌన్ రోటరీ సెక్రెటరీ బివి రాజు, రోటరీ ఐ హాస్పిటల్ ప్రెసిడెంట్ బాల సూర్యరావు, హార్ట్ ఫుల్ నెస్ వర్కింగ్ మెంబర్ పి సత్యప్రసాద్, హార్ట్ ఫుల్ నెస్ ట్రైనర్ కే అన్నపూర్ణ పాల్గొన్నారు.








Comments