కమాండ్ కంట్రోల్ రూమ్ పునః ప్రారంభించిన డీఐజీ కోయ ప్రవీణ్
- PRASANNA ANDHRA

- 2 hours ago
- 1 min read
కమాండ్ కంట్రోల్ రూమ్ పునః ప్రారంభించిన డీఐజీ కోయ ప్రవీణ్

వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తో కలిసి ప్రారంభించారు. అలాగే 8 నూతన బ్లూ కోల్ట్స్ ద్విచక్ర వాహనాలను, బ్లూ కోల్ట్స్ సిబ్బందికి హెల్మెట్లు నైట్ జాకెట్స్ అందించిన డీఐజీ ప్రవీణ్. అనంతరం కమాండ్ కంట్రోల్ ఏర్పాటుకు కృషిచేసిన రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ సదాశివయ్య స్టేషన్ సిబ్బందిని అభినందించి, సీసీ కెమెరాలు సమకూర్చిన దాత తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు ను ప్రత్యేకంగా అభినందిస్తూ వారితో పాటు ఇతర దాతలను డిఐజి కోయ ప్రవీణ్ సన్మానించారు. నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పట్టణ వ్యాప్తంగా 123 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వాటిని స్థానిక కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు డీఎస్పీ భావనాతో పాటు సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.








Comments