top of page

రాష్ట్రానికి టీ.డీ.పి, వై.సి.పి రాహు-కేతువులు

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 15, 2023
  • 1 min read

రాష్ట్రానికి టీ.డీ.పి, వై.సి.పి రాహు-కేతువులు


ముఖ్యమంత్రిగా జగన్ విఫలం

-- తులసి రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న తులసి రెడ్డి

ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :


రాష్ట్రానికి వైసీపీ, టిడిపి పార్టీలు రాహు కేతువులు లాంటివని.. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర మీడియా చైర్మన్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి పూల భాస్కర్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులో గల భాస్కర్ నిలయం నందు ఆరు మండలాలకు చెందిన కార్యకర్తలతో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు.

ree

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తులసి రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ వై.యస్ జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసును రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఛేదించకపోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ కీడు చేయలేదని, మేలే చేసిందని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి బిజెపి, వైసీపీ, టిడిపి లు ద్రోహం చేశాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అసమర్ధ పాలన వలన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని.. మరమ్మతులకు నిధులు ఇవ్వకపోవడంతోనే అలా జరిగిందని ఆరోపించారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క హామీ కూడా నేటికీ నెరవేర్చలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని, ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన జూడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకున్నదని.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌతమ్, అన్ని మండలాల నుంచి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page