178 మంది ఏపీ ప్రయాణికులు: వాల్తేరు డీఆర్‌ఎం
- EDITOR

- Jun 3, 2023
- 1 min read
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 178 మంది ఏపీ ప్రయాణికులు: వాల్తేరు డీఆర్‌ఎం


ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు వాల్తేరు డీఆర్‌ఎం వెల్లడించారు.
వందమందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. వీరితోపాటు జనరల్ బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. బాలేశ్వర్ నుంచి ప్రత్యేక రైలు మరో 2 గంటల్లో విశాఖ రానున్నట్లు చెప్పారు. మరోవైపు విశాఖ నుంచి మరమ్మతు సిబ్బందితో ఒక రైలు బాలేశ్వర్ వెళ్తోందని చెప్పారు. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎంతమంది ఏపీ వాసులున్నారో తేలాల్సి ఉందని అన్నారు.










Comments