సూపర్ స్పెషాలిటీ డీ.ఎం ఇంటర్వెన్షన్ రేడియాలజీ లో మొదటి ర్యాంక్ సాధించిన డాక్టర్ భవానీ శంకర్
- PRASANNA ANDHRA

- 15 hours ago
- 1 min read
సూపర్ స్పెషాలిటీ డీ.ఎం ఇంటర్వెన్షన్ రేడియాలజీ లో మొదటి ర్యాంక్ సాధించిన డాక్టర్ భవానీ శంకర్


డి.భవాని శంకర్ అఖిలభారత వైద్య విజ్ఞానసంస్థ న్యూ ఢిల్లీ వారు నిర్వహించిన జాతీయస్థాయి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ AIIMS మెరిట్రస్టులో (AML) మొదటి ర్యాంకు సాధించి శ్రీచిత్రా తిరునాల్ ఇన్స్ట్యూట్ ఫార్ మెడికల్ సైన్సెస్ మరియు టెక్నాలజి, తిరువనంతపురంలో (కార్డియోవ్యాస్కులార్ రేడియాలజి మరియు ఎండోవ్యాస్కులార్ ఇంటర్వెంసన్ విభాగములో) Doctorate of Medicine లో (DM) సీటు సాధించాడు. ఈయన తండ్రి డి.సుధాకర్, సి.ఐ.డి. డిపార్ట్మెంట్, తిరుపతిలో పని చేస్తుండగా, తల్లి సుధమాధవి గృహిణిగా ఉన్నారు. 10వ తరగతి వరకు స్థానిక గౌతమ్ హైస్కూల్ ప్రొద్దుటూరులో, ఇంటర్ విజయవాడలో చదివాడు, కర్నూల్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ చదివాడు. ఎండో వ్యాస్కులార్ ఇంటర్ వెన్షన్ రేడియాలజిలో DM చేసి ప్రజలకు సేవ చేస్తానని భవాని శంకర్ తెలిపారు. ఈ గణతను సాధించిన సందర్భంగా గౌతమ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ టి. సుధీర్, డైరెక్టర్ టి.మునిస్వామి నాయుడు మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.







Comments