top of page

ప్రొద్దుటూరులో నేడు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 14, 2022
  • 2 min read

Updated: Nov 15, 2022

ప్రొద్దుటూరు పట్టణం నందు 15.11.2022వ తేది ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే నూతన మార్కెట్ భూమి పూజ కు వచ్చే ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు మరియు చుట్టుప్రక్కల ప్రదేశాల నుండి వచ్చే ప్రజలకు ప్రొద్దుటూరు పోలీస్ వారు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తూ ప్రజలు సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేశారు.

ree

మంగళవారం అనగా 15.11.2022 వ తేది ఉదయం నుండి సాయంత్రం వరకు మార్కెట్ భూమి పూజ ఉన్నందున ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండుటకు గాను ప్రొద్దుటూరు పోలీసులు వాహనదారులకు దిగువ ఇవ్వబడిన సూచనలు చేశారు:

1) జమ్మలమడుగు వైపు నుండి వచ్చే బస్సులు ప్రొద్దుటూరు టౌన్ లోని రాకుండా పొట్టిపాడు క్రాస్ రోడ్డు దగ్గర నుండి ట్రాఫిక్ డైవర్సన్ జమ్మలమడుగు బైపాస్ రోడ్డుకు చేయడం జరిగింది.


2) మైదుకూరు వైపు నుండి వచ్చే బస్సులు ప్రొద్దుటూరు టౌన్ లోని రాకుండా RTC Bus stand దగ్గర నుండి రాక పోక లు సాగిస్తాయి.


3) రాజుపాలెం వైపు నుండి వచ్చే బస్సులు ప్రొద్దుటూరు టౌన్ లోని రాకుండా కొర్రపాడు రోడ్డు లో ఉన్న పెద్దమ్మ చెట్టు (Near TVR school) నుండి రాక పోక లు సాగిస్తాయి.


4) ఎర్రగుంట్ల వైపు నుండి వచ్చే బస్సులు ప్రొద్దుటూరు టౌన్ లోని రాకుండా Yerraguntla bypass junction (Vasavi Circle) నుండి ట్రాఫిక్ డైవర్సన్ మోడంపల్లె బైపాస్ రోడ్డు కు చేయడం జరిగింది.


5) మార్కెట్ భూమి పూజ కు వాహనాలలో వచ్చే VIP లు శివాలయం దగ్గర ఉన్న T.T.D కళ్యాణ్ మండపం నందు పార్కింగ్ చేసుకోనవలయును.


6) మైదుకూరు వైపు నుండి మార్కెట్ భూమి పూజ కు వాహనాలలో వచ్చే ప్రజలు జిన్నా రోడ్ క్రాస్ ఎదురుగా ఉన్న మిల్ నందు పార్కింగ్ చేసుకోనవలయును.


7) మార్కెట్ భూమి పూజ కు కొర్రపాడు వైపు నుండి వాహనాలలో వచ్చే ప్రజలు, ప్రొద్దుటూరు 3 టౌన్ పి.యస్ ప్రక్కన ఉన్న రాస్తా గుండా పోయి మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ నందు పార్కింగ్ చేసుకోనవలయును.


8) మార్కెట్ భూమి పూజ కు విజయ కుమార్ సర్కిల్ మరియు రాజీవ్ సర్కిల్ వైపు నుండి వాహనాలలో వచ్చే ప్రజలు, కోర్ట్ ప్రక్కన ఉన్న రాస్తా గుండా పోయి మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ నందు పార్కింగ్ చేసుకోనవలయును.


9) మార్కెట్ భూమి పూజ సందర్భముగా KK street లో సెంట్రల్ పార్కింగ్ చేయడం నిషేదించడమైనది.


10) రాజీవ్ సర్కిల్ సర్కిల్ నుండి RTC Bus Stand కు వెళ్ళు ప్రజలు, రాజీవ్ సర్కిల్ నుండి AK రోడ్ మీదుగా RTC Bus Stand పోవలయును.


11) RTC Bus Stand నుండి రాజీవ్ సర్కిల్ సర్కిల్ కు వెళ్ళు ప్రజలు, పాండు రంగ టెంపుల్ నుండి 2 టౌన్ బైపాస్ రోడ్, AK రోడ్ మీదుగా Sub Register office వద్ద నుండి పోవలయును.


కావున ప్రజలందరూ పైన తెల్పిన సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలిగించకుండా సహకరించ వలసిందిగా ప్రొద్దుటూరు పోలీసులు కోరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page