top of page

కిలో టమాటా ధర రూ. 200 నుంచి 250

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 16, 2023
  • 1 min read

కిలో టమాటా ధర రూ. 200 నుంచి 250

ree

చండీగఢ్ మార్కెట్​లో టమాటా ధర తారా స్థాయికి చేరుకుంది. కిలో టమాటా ధర రూ. 200 నుంచి 250 వరకు పలుకుతోంది. అదే రిటైల్ దుకాణాల్లో​ అయితే టమాటా ధర మరింత భగ్గుమంటోంది. ఏకంగా రూ. 300 నుంచి 400 లకు విక్రయిస్తున్నారు. కాస్త తక్కువ నాణ్యత గల టమాటా అదే మార్కెట్లో రూ. 100 - 150గా ఉంది. ఈ ధరలు చూసిన స్థానికులు.. లీటర్ పెట్రోల్ కంటే కిలో టమాటా ధర ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు. కాగా ధరలు పెరుగుతున్న క్రమంలో టమాటా నిల్వ ఉంచుకున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే భారీ వర్షాలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని కూరగాయల విక్రయదారులు చెబుతున్నారు.

ree

కాగా చండీగఢ్​కు ప్రధానంగా పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్​ రాష్ట్రాల నుంచే కూరగాయలు వస్తుంటాయి. ముఖ్యంగా టమాటా, ఉల్లి నాశిక్ నుంచి వస్తాయి. కానీ నిరంతర వర్షాల వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి.. రవాణా నిలిచిపోయింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో వర్షాల కారణంగా కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం హరియాణా నుంచి కాకరకాయ, ఓక్రా, పచ్చిమిర్చి మాత్రమే వస్తున్నాయి. ఇక టమాటా సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చండీగఢ్ మార్కెట్​కు సోలన్​ జిల్లా నుంచే టమాటా సరఫరా అవుతున్నాయని విక్రయదారులు పేర్కొన్నారు...!!

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page