చిట్వేలి-కోడూరు రహదారికి మహర్దశ.చెవ్వు. శ్రీనివాసులు రెడ్డి
- DORA SWAMY

- Feb 28, 2024
- 1 min read
చిట్వేలి-కోడూరు రహదారికి మహర్దశ.
---భూమిపూజను జయప్రదం చేద్దాం.
కన్వీనర్ చెవ్వు. శ్రీనివాసులు రెడ్డి.

ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చిట్వేలి-కోడూరు రహదారి విస్తరణ పనులకు నేటికీ వైసీపీ ప్రభుత్వంలో మహర్దశ కలిగిందని మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసిన 35 కోట్ల రూపాయల వ్యయంతో గురువారం అనగా ఫిబ్రవరి 29న ఉదయం 9 కి నాగవరం గ్రామం నందు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభిస్తున్నట్లు మండల కన్వీనర్ తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలోనే ఈ పనిని చేపట్టాలని భావించినప్పటికీ,కరోనా తదితర సమస్యల వల్ల ఆలస్యమైందన్నారు. నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రత్యేక చొరవ చూపిన ఎంపీ మిథున్ రెడ్డికి,ఎమ్మెల్యే కొరముట్లకు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి కోరారు.








Comments