
సీఎం తో సినీ ప్రముఖులు భేటీ
- PRASANNA ANDHRA

- Feb 10, 2022
- 1 min read
సీఎంతో భేటీకి తారక్ దూరం, సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లిన టాలీవుడ్ ప్రముఖుల్లో యంగ్ టైగర్ NTR లేడు, తొలుత తారక్ వెళ్తారని ప్రచారం జరిగినా ఆయన బేగంపేట విమానాశ్రయానికి వెళ్లలేదు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనని కలిశారు. సినీ పరిశ్రమ నటులు అలీ, పోసాని, ఆర్ నారాయణ మూర్తి కూడా సీఎం జగన్ ని కలిశారు. టికెట్ల రేట్లతో పాటు మొత్తం 17 అంశాలపై చర్చ జరగనుంది అని సమాచారం.








Comments