స్పందన అర్జీలను వెంటనే పరిష్కరించండి. చెవ్వు శ్రీనివాసులు రెడ్డి.
- DORA SWAMY

- Jul 25, 2022
- 1 min read
స్పందన అర్జీదారులకు సత్వరమే న్యాయం చేయండి.
"స్పందన" లో మండల తహసిల్దార్ కు సూచించిన
చిట్వేలి మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులరెడ్డి.

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం రెవెన్యూ కార్యాలయం నందు డీటీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మురళీకృష్ణ మండల తాసిల్దారుగా నియమించబడ్డ తర్వాత ఈరోజు ఉదయం మొదటగా నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న చిట్వేలి వైసీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ భూ రెవెన్యూ రేషన్ సంబంధిత ఏదేని సమస్యలపై స్పందనలో అర్జీలను సమర్పించే బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని నిష్పక్షపాత ధోరణితో వ్యవహరించాలని తాహసిల్దార్ మురళీకృష్ణ కు సూచించారు.
ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం లక్ష్మికర్ వైసిపి నాయకులు నరసింహ, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.








Comments