top of page

అవ్వ తాతల ఆనందమే మా ప్రభుత్వానికి శ్రీరామరక్ష. చెవ్వు శ్రీనివాసులు రెడ్డి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Aug 1, 2022
  • 1 min read

Updated: Aug 2, 2022

అవ్వ తాతల ఆనందమే వైసీపీ ప్రభుత్వానికి శ్రీరామరక్ష.

నూతన పింఛన్ల పంపిణీలో చెవ్వు శ్రీనివాసులురెడ్డి.

ree

అర్హులైన అవ్వ తాతల మోము లో ఆనందమే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని..ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం రాజుకుంట మరియు చెర్లోపల్లి పంచాయతీలోని అర్హత పొందిన పింఛన్దారులకు పింఛను పంపిణీ చేస్తూ వైసీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా "అర్హత ఉంటే చాలు అందుకో పింఛను" అనే నూతన వరవడికి శ్రీకారం చుట్టిన ఏకైక పార్టీ వైసీపీ అని ఉద్ఘాటించారు.


పింఛను పంపిణీలో పాల్గొన్న గ్రామ వైసిపి నాయకులు మాదినేని కనకరాజు,మాదినేని చిన్నా రాయల్, మాదినేని లోకేష్ మరియు చెర్లోపల్లె గ్రామ సర్పంచ్ ఓబినేని ఈశ్వరయ్యలు మాట్లాడుతూ... పింఛను పొందేందుకు అర్హత పొందిన ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్లి వారికి సకాలంలో లబ్ధిని చేకూర్చడంలో గ్రామ వాలంటరీల మరియు సచివాలయ సిబ్బంది పాత్ర అమోఘమని, వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

లబ్ధిదారుల సంతృప్తి :-- ఇరు పంచాయతీలలోనీ సచివాలయ పరిధిలో నూతనంగా పింఛను పొందిన సుమారు 21 మంది పింఛను నగదును అందుకుంటూ వైసీపీ ప్రభుత్వానికి, వైసిపి నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు యన్నారు తేజ, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు, నూతన పింఛను లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page