top of page

ఐక్యతతోనే అధికారం సాధ్యం. ఆత్మీయ సభలో కాపు నేతలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Aug 24, 2022
  • 1 min read

కాపు సంక్షేమ సేన ఆత్మీయ సమావేశం

ree

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు పట్టణం లోని తేజ కళ్యాణ మండపంలో బుధవారం కాపు సంక్షేమసేన ఆత్మీయ సమావేశం కాపు సంక్షేమ సేన రాష్ట్ర నాయకులు అనంతరాయలు, కాపు సంక్షేమ యువసేన నియోజకవర్గ అధ్యక్షులు ముత్యాల కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ree

ఈ ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి పార్టీలకతీతంగా బలిజ నాయకులు హాజరవ్వడం విశేషం.ఈ ఆత్మీయ సమావేశంలో మొదటగా అన్నమయ్య జిల్లా కె యస్ యస్ అధ్యక్షులుగా ఎన్నికైన బల్లేపల్లి వెంకటరమణ,జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి రాణి, జిల్లా మహిళా కార్యదర్శి రెడ్డమ్మ లను సన్మానించడం జరిగింది.

ree

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె ఎస్ ఎస్ కోఆర్డినేటర్ మస్తాన్ రాయల్, పిడుగు సుబ్బరాయుడు, మాదాసు నరసింహ లు పాల్గొన్నారు.ఈ ఆత్మీయ సమావేశంలో హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకొని ఒక సామాజిక వర్గమే కాకుండా ఇతర సామాజిక వర్గాలతో కూడా మిళితమై ముందుకు కొనసాగాలని,ఇలా జరిగితేనే రాజ్యాధికారం దిశంగా మన జాతి అడుగులు వేస్తుందని ఎక్కడైనా ఏదైనా సమావేశం నిర్వహిస్తే ప్రతి ఒక్కరూ ఐక్యమతంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనకు ఎందుకులే అని నిర్లక్ష్యం చేయకుండా ఏరోజైతే మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్తంగా ఉంటామో ఆరోజే మనం రాజ్యాధికారం సాధిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సిహెచ్ రమేష్ బాబు, నార్జాల హేమరాజ్, పోతురాజు నవీన్,కొమ్మా శివ,సభాపతి, ఉత్తరాది శివకుమార్ మరియు ఐదు నియోజకవర్గాల బలిజ పెద్దలు కాపు సంక్షేమ సేన నాయకులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page