top of page

కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 11, 2022
  • 1 min read

అన్నమయ్య జిల్లా  కలెక్టరేట్  వద్ద,  జనం కోసం

సిపిఎం ఆధ్వర్యంలో  సోమవారం మహాధర్నా!


ree

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం సిపిఎం పార్టీ  ఆధ్వర్యంలో మహా  ధర్నా నిర్వహించారు. జనం కోసం సిపిఎం,  ఇంటింటికి సిపిఎం కార్యక్రమం ద్వారా, ప్రజల ద్వారా వచ్చిన అర్జీలను కలెక్టర్ కి అందించారు.


సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ..



పేదలకు భూములు పంచాలని, అసైన్మెంట్ కమిటీ పునరుద్ధరించాలని, భూకబ్జాలు అరికట్టాలని, నకిలీ పట్టాలు  పై విచారణ జరపాలని, బోగస్ ఆన్లైన్లో తొలగించాలని, బాధితులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, భూమి కొనుగోలు పథకాన్ని పునరుద్ధరించాలని, జగనన్న కాలనీలు ప్రభుత్వమే కట్టించాలని, లేదా ఐదు లక్షలు ఇవ్వాలని, నిత్యవసర వస్తువుల ధరలు, తగ్గించాలని;కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, తగ్గించాలని, ఆస్తిపన్ను, చెత్త పన్ను ఉపసంహరించాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం  ప్రణాళిక తయారు చేయాలన్నారు.


నూతన విద్యా విధానం రద్దు చేయాలని, పాఠశాల విలీనం, ఉపసంహరించాలని, రైతుల వ్యవసాయ బోర్ల మోటార్లకు మీటర్లు రద్దు చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు, కాలనీల తో సంబంధం లేకుండా, 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించాలన్నారు. పంచాయతీ వర్కర్స్   గ్రీన్ అంబాసిడర్ లకు పది నెలల వేతనం బకాయిలు చెల్లించాలన్నారు. గాలేరు-నగరి,  హంద్రీ-నీవాకు నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు. ఇసుక గ్రావెల్ గ్రానైట్ పట్టి అక్రమ రవాణా అరె కట్టాలన్నారు. ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణ 2013 చట్టప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. విభజన చట్టం హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, కడప ఉక్కు ప్రారంభించాలని, వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలని, మంగంపేట   బరైటీస్ మిల్లులు తెరిపించాలని,  తాగునీటి  సమస్య పరిష్కరించాలని కోరగా కలెక్టర్ స్పందించి, ప్రజలు ఇచ్చిన అర్జీ లపై పరిశీలించి  విచారించి న్యాయం చేస్తామన్నారు.


చిట్వేలు మండలం కందుల వారి పల్లి గిరిజనులకు ట్రాన్స్ఫారం లేకపోవడంతో, మూడు సంవత్సరాల నుంచి తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని, బిందెలతో నిరసన చేస్తున్న విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా 24 గంటల్లో ట్రాన్స్ఫారం  బిగించి నీళ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ  రాష్ట్ర నాయకులు  బాల కాశి, రామన్న, అన్నమయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి, శ్రీనివాసులు, జిల్లా నాయకులు సిహెచ్ చంద్రశేఖర్,  రామాంజనేయులు,చిట్వేలు రవికుమార్, నంద్యాల శంకరమ్మ, లింగాల యానాదయ్య, పంది కాళ్ళ మణి, ఎం జయరామయ్య,  ఓబిలి, పెంచలయ్య, దాసరి జయచంద్ర, మద్దెల ప్రసాద్, బొజ్జ శివయ్య, ఓబులమ్మ, ఖాజాబీ, ప్రభావతి, బంగారు పాప, మదనపల్లి ,పీలేరు, తంబళ్లపల్లె,  రాయచోటి,రాజంపేట, రైల్వే కోడూర్ నియోజకవర్గంలోని కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page