top of page

ఒడ్డుకు చేరిన టైటాన్ సబ్మెర్సిబుల్ సెకలాలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 29, 2023
  • 1 min read

ఒడ్డుకు చేరిన టైటాన్ సబ్మెర్సిబుల్ సెకలాలు

ree

సముద్ర గర్భంలో పేలిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలు ఒడ్డుకు చేరాయి. వాటిలో మానవ అవశేషాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.


టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి తీవ్ర పీడనం కారణంగా సముద్ర గర్భంలోనే సబ్‌మెర్సిబుల్ పేలిపోయింది. పేలిపోయిన టైటాన్ జలాంతర్గామి శకలాలు తాజాగా తీరాన్ని చేరాయి.

కెనడాలోని న్యూఫౌండ్ లాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్సులో సెయింట్ జాన్స్ ఓడరేవుకు బుధవారం వాటిని తీసుకొచ్చినట్లు యూఎస్ తీర రక్షణ దళం అధికారులు బుధవారం వెల్లడించారు.


కాగా, స్వాధీనం చేసుకున్న శకలాలు, మానవ అవశేషాలను వైద్య పరిశోధకులు పరిశీలిస్తారని యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. ఇకపోతే... ఈ నెల 18వ తేదీన మినీ టైటాన్ బయలు దేరింది.


ఈ మినీ జలాంతర్గామిలో 96 గంటలకు సరిపాడా ఆక్సిజన్ ఉంది. అయితే, సాగరగర్భంలోకి వెళ్లిన గంటా 45 నిమిషాల తర్వాత టైటాన్‌తో సంబంధాలు తెగిపోయాయి.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page