తిరుమల నడక మార్గంలో చిరుత, ఎలుగుబంటి సంచారం
- EDITOR

- Oct 27, 2023
- 1 min read


తిరుమల
అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలో రికార్డయింది. దీంతో నడక దారి భక్తులను తితిదే అప్రమత్తం చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గంపులుగా వెళ్లాలని సూచించింది. మరో వైపు చిరుత, ఎలుగబంటిని బంధించేందుకు తితిదే, అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.








Comments