తిరుమలలో భారీగా భక్తుల రద్దీ...
- PRASANNA ANDHRA

- Apr 15, 2023
- 1 min read
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..


తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పిల్లలకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. నేడు (శనివారం) వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తుల స్వామివారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. శుక్రవారం 66,310 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 31,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.











Comments