తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో
- MD & CEO

- Mar 16, 2022
- 1 min read
తిరుమల తిరుపతి దేవస్థానములు వారు 2022 ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మరియు నిజ పాద దర్శనం మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా కేటాయించడం జరుగుతుంది. ఈనెల 20 వ తేదీ ఉదయం 10 గంటల నుండి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు కేటాయిస్తారు.

కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకరణ సేవ మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మొదటి గా బుక్ చేసుకున్న వారికి మొదటిగా (FIFO పద్ధతిన) కేటాయించడం జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.








Comments