మాస్టర్ కి సాయంతో ద్విచక్ర వాహనాల చోరీ - వివరాలు వెల్లడించిన కడప జిల్లా ఎస్పీ
- PRASANNA ANDHRA

- Feb 12, 2024
- 1 min read
మాస్టర్ కి సహాయంతో ద్విచక్ర వాహనాల చోరీ
పక్కా ప్రణాళికతో నిందితుడిని అరెస్టు చేసిన మూడో పట్టణ పోలీసులు
టీవీఎస్ ఎక్సెల్ వాహనాలే లక్ష్యంగా దొంగతనాలు
15 లక్షల రూపాయల విలువ చేసే 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
అన్న క్యాంటీన్, డాబా ల వద్ద పార్క్ చేసిన వాహనాలే లక్ష్యంగా, మాస్టర్ కీ ఉపయోగించి ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేసిన దువ్వూరు గ్రామం అశోక్ నగర్ షావుకారుల వీధికి చెందిన 48 సంవత్సరాల అంకయ్య అనే వ్యక్తిని Cr.No 46/2024 అరెస్టు చేసి అతని వద్ద నుండి 15 లక్షల రూపాయలు విలువచేసే 20 టీవీఎస్ ఎక్సెల్ వాహనాలు, అలాగే ఒక హోండా యాక్టివా వాహనాన్ని ప్రొద్దుటూరు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 24వ తేదీన గోర్ల ఈశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సోమవారం మధ్యాహ్నం కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌన్సిల్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న డి.ఎస్.పి మురళీధర్, చాకచక్యంగా వ్యవహరించి ద్విచక్ర వాహనాలను రికవరీ చేసిన మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటరమణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుల్స్ తిరుమలయ్య, దస్తగిరి, లక్ష్మి కాంత్ రెడ్డి, ధనుంజయలను అభినందించిన జిల్లా ఎస్పీ.
To Watch this video Click Here













Comments