విజయనగరం వీధిలో చోరీ
- PRASANNA ANDHRA

- May 11, 2023
- 1 min read
విజయనగరం వీధిలో దొంగతనం



కడప జిల్లా, ప్రొద్దుటూరు
విజయనగరం వీధిలో దొంగతనం కలకలం రేపింది, 20 తులాలకు పైగా బంగారు వస్తువులు, లక్ష రూపాయల మేర నగదు అపపహరణకు గురైనట్లు తెలిపిన బాధితురాలు. బాధితురాలు సుభాషిని సోమవారం ఆమె కుమార్తెతో కలిసి చెన్నైకి వెళ్లారు, గురువారం ఉదయం తిరిగి తమ ఇంటికి వచ్చారు, వేసిన తాళం వేసినట్లే ఉంది, లోనికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం గమనించిన సుభాషిణి. బీరువాలోని బంగారు నగలు, డబ్బు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.











Comments