టీడీపీ రాష్ట్ర బీసీ కార్యదర్శిగా తాటి శ్రీనివాసులు
- PRASANNA ANDHRA

- Sep 21, 2022
- 1 min read
విజయవాడ

బుధవారం ఉదయం విజయవాడలో కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ ఆరవ వార్డు మాజీ కౌన్సిలర్ తాటి శ్రీనివాసులు యాదవ్ ను రాష్ట్ర బీసీ కార్యదర్శిగా, తమ్మిశెట్టి సురేంద్ర ను ప్రొద్దుటూరు నియోజకవర్గ బీసీ అధ్యక్షుదిగా ప్రకటించగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శ్రీనివాస్ యాదవ్, సురేంద్రలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకముంచి పదవులు అప్పగించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమంలో తమ్మిశెట్టి శ్రీనివాసులు, కమల్ బాషా, చింతల పూరి రమేష్, చింతలపురి నరసింహ్మ, పూల వెంకటేష్, బండారు గురప్ప, సూరి(సెల్), యెస్ ఎం బాషా, టైలర్ మస్తాన్, సత్యరెడ్డి, ఫైనాన్స్ శ్రీను, హజీవలి, ప్రసాద్ యాదవ్, జి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








Comments