ఖాతాదారులు భయాందోళనలకు గురికావద్దు - తనకంటి జ్యువెలర్స్
- EDITOR

- Nov 23
- 1 min read
ఖాతాదారులు భయాందోళనలకు గురికావద్దు - తనకంటి జ్యువెలర్స్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఖాతాదారులు ఎటువంటి భయాందోళనకు గురికావద్దని కేసు ముగిసే వరకు తమకు సహకరించాలని కోరుకుంటూ తనకంటి జ్యువెలర్స్ యజమాని ఉదంతంపై ప్రజల్లో వ్యాపిస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని తనకంటి శ్రీనివాసులు సతీమణి లక్ష్మి ఆదివారం రాత్రి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వెలుపల పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఖాతాదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తన భర్త తనకంటి శ్రీనివాసులు చేతులు మీదుగా వ్రాసిన ఒక లేఖను పాత్రికేయులకు చూపిస్తూ తమకు ఆర్డర్లు ఇచ్చినవారు ఎటువంటి భయాందోళనలకు లోను కావద్దని తాను తొందరలో బయటికి వచ్చి ఖాతాదారులు ఇచ్చిన అడ్వాన్స్ రుసుము, స్కీము డబ్బులు ఆర్డర్ల రూపేనా వచ్చిన గట్టు బంగారు త్వరలో చెల్లిస్తామని లేఖలో పొందుపరిచినట్లు లక్ష్మి తెలిపారు.








Comments