తనకంటి బ్రదర్స్ కు బెయిల్... పోలీసులకు షాక్...
- EDITOR

- Nov 25
- 1 min read
తనకంటి బ్రదర్స్ కు బెయిల్ పోలీసులకు షాక్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలో సంచలంగా మారిన ప్రొద్దుటూరు బంగారు వ్యాపారస్తుడు తనకంటి శ్రీనివాసులు అతని సోదరుడు వెంకటస్వామి లను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు నమోదైన కేసు విషయమై విచారణ చేపట్టవలసిన పోలీసులు, అందుకు విరుద్ధంగా అన్నదమ్ములను ఇద్దరినీ ప్రైవేట్ వాహనంలో తరలించి ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ నందు విచారణ పేరుతో విచక్షణ రహితంగా వారిపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడి, ఇంటిలోకి చొరబడి బంగారు దుకాణ తాళాలు అలాగే కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకోవడంపై నియోజకవర్గ వ్యాప్తంగా ఒక సామాజికవర్గం అలాగే సాక్షాత్తు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఈ ఉదంతంపై పోలీసులను ప్రశ్నించడంతో కేసులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. తమ కస్టడీలో ఉన్న సోదరులను సోమవారం త్రీటౌన్స్ సిఐ ఆధ్వర్యంలో కోర్టుకు హాజరు పరచగా నడవలేని స్థితిలో వెంకటస్వామి కోర్టుకు హాజరయ్యారు, న్యాయమూర్తి ఈ విషయమై ఆరా తీశారు. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి ఎదుట వెంకటస్వామి తన గోడు వెళ్ళపుచ్చుకున్నాడు. అయితే కోర్టుకు హాజరు పరిచే ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకున్న వైద్య ధ్రువీకరణ పత్రంలో ఎటువంటి గాయాలు లేవని వ్రాసినట్లు గమనించిన న్యాయమూర్తి అడ్వకేట్ కమిటీలతో కలిసి స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం వెంకటస్వామిని పంపించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగించుకున్న వెంకటస్వామిని కోర్టు నందు హాజరుపరచగా అర్ధరాత్రి వరకు కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి సోదరులు తనకంటి శ్రీనివాసులు, తనకంటి వెంకటస్వామి లకు 20వేల రూపాయల సొంత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ, కేసులో పోలీసుల వ్యవహార శైలిని ప్రశ్నించారు? శ్రీనివాసులకు అలాగే వెంకటస్వామికి రానున్న రోజులలో ఏ చిన్న అపాయం హాని జరిగిన అది పోలీసుల బాధ్యత అని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం వైయస్సార్ కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ ఐపిఎస్ ఒక పత్రిక ప్రకటన ద్వారా ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఎం తిమ్మారెడ్డి కేసును సరైన రీతిలో విచారణ చేయకపోవడం వలన, విచారణ తీరుపై పలు వర్గాల నుండి విమర్శలు వచ్చాయని విమర్శల తీవ్రత దృష్ట్యా పోలీసుల విచారణలో లోపాలపై లోతైన విచారణ చేపట్టడం జరుగుతుందని, సరైన విచారణ నియమాలు పాటించని వన్ టౌన్ సిఐ తిమ్మారెడ్డిని వీఆర్ కు ఆదేశించినట్లు, కేసు సమగ్ర దర్యాప్తునకు ప్రొద్దుటూరు డిఎస్పి పి భావన కు అప్పగించటం జరిగిందని పత్రికా ప్రకటన ద్వారా ఎస్పీ తెలిపారు.








Comments