ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి పదో తరగతి విద్యార్థిని కి గాయాలు
- PRASANNA ANDHRA

- Apr 27, 2022
- 1 min read
ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి పదో తరగతి విద్యార్థిని కి గాయాలు
బస్సు అతివేగానికి జారి కింద జారిపడ్డ పదో తరగతి విద్యార్థినికి గాయాలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిన కారంపూడి టు దాచేపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు

పల్నాడు జిల్లా కారంపూడి మండలం పెద్ద కొదమ గుండ్ల హైస్కూల్లో పదవ తరగతి చదువుతూ పరీక్షల నిమిత్తం కారంపుడి పట్టణంలో సెయింట్ జోన్స్ స్కూల్ కి వచ్చి పరీక్షలు రాసి వెళ్తున్న తరుణంలో కారంపూడి టూ దాచేపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్తున్న సమయంలో బ్రహ్మనాయుడు కాలనీ సమీపంలో బస్సు వేగానికి పెద్ద కొదమగుండ్ల గ్రామం హై స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న సుమలత అనే విద్యార్థి బస్సు నుంచి జారిపడి గాయాలు కాగా బస్సు కనీసం ఆపకుండా వెళ్లారని బాధిత సుమలత తెలిపింది తాను బస్సు నుంచి జారిపడ్డ దానికి బస్సు అతి వేగమే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆవేధన వ్యక్తం చేశారు సదరు సుమలత గాయాలు అయ్యాయని తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు స్థానిక వైద్యుని దగ్గర ఆమెకి ప్రధమ చికిత్స అందిస్తున్నారు పదో తరగతి పిల్లలకు తోడుగా వారి సౌకర్యార్థం నలుగురు టీచర్ల తోడుగా వెళ్లిన కూడా సదరు విద్యార్థిని కింద పడిన పట్టించుకోని టీచర్లు.









Comments