top of page

కులం పేరుతో దూషించారంటూ మహిళ ఆవేదన

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 6, 2024
  • 1 min read

కులం పేరుతో దూషించారంటూ మహిళ ఆవేదన

మాట్లాడుతున్న బాధిత మహిళ రాజేశ్వరి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కులం పేరుతో దూషించారంటూ మంగళవారం సాయంత్రం ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో రాజేశ్వరి అనే మహిళ ఆవేదన, ప్రొద్దుటూరులోని ప్రముఖ వెటర్నరీ మెడికల్ షాప్ యజమాని అయిన తెల్లాకుల మనోహర్ పై ఆరోపణలు గుప్పించారు. వివరాల్లోకి వెళితే, మంగళవారం ఉదయం 10:45 నిమిషాల ప్రాంతంలో తమ పెంపుడు జంతువుకు వెటర్నరీ మందులు కావాలని శ్రీనివాస నగర్ లోని శివశంకర్ వెట్ ఫార్మా కు సదరు రాజేశ్వరి వెళ్లి పలు రకాల మందులు కొనుగోలు చేసినట్లు, అనంతరం డబ్బు చెల్లించే విషయమై ధరలు తగ్గించమని తాను కోరానని, యజమాని తెల్లాకుల మనోహర్ తనపై కుల దూషణ చేశాడని ఆరోపణలు గుప్పించింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయమని డి.ఎస్.పి మురళీధర్ ను కోరగా, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు Cr no 36/24 U/S 307, 509 IPC sec 3 (1),(r), (s) sc st (POA)act సెక్షన్ల కింద కేసు నమోదు నమోదైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page