top of page

ప్రొద్దుటూరులో టీడీపీ కి ఊహించని ఝలక్...

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 10, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక మునిసిపల్ ఆరవ వార్డు ఎర్రన్న కొట్టాలలో దాదాపు నూరు కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలో చేరాయి.

వార్డు వైసీపీ కౌన్సిలర్ జయంతి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ పాతకోత బంగారు మునిరెడ్డి సమక్షంలో టీడీపీ నాయకులు ఎం.ఆర్.పీ.ఎస్ సుధాకర్ మాదిగ, డీలర్ సుధాకర్ తో పాటు దాదాపు నూరు కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. టీడీపీ ప్రొద్దుటూరు ఇంచార్జి జి.వి. ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోని వార్డు నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరటం ఇక్కడ గమనార్హం. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాబోవు ఎన్నికల నేపథ్యంలో పొత్తులకు సై అని, రాజ్యాధికారమే పరమావధిగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అని ప్రకటించగా, ప్రొద్దుటూరులో టీడీపీ నుండి వైసీపీలో చేరికలు ప్రాధాన్యత సంతరించుకొంది. గత మునిసిపల్ ఎన్నికలలో ఆరవ వార్డులో సరయిన అభ్యర్థిని టీడీపీ ఎంపిక చేయటంలో చేసిన తప్పిదాలే, నేడు వైసీపీలో చేరికలకు కారణంగా చెప్పవచ్చు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ వైసీపీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పెద్దపీఠ వేస్తుందని, సుధాకర్ మాదిగ తమ పార్టీలో చేరటం ఎంతో సంతోషంగా ఉందని, రాబోవు రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలోకి మరిన్ని చేరికలు జరగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్య్ రాచమల్లు, మునిసిపల్ వైస్ చైర్మన్ పాతకోత బంగారు మునిరెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి పగిడాల దస్తగిరి, ఆరవ వార్డు వైసీపీ కౌన్సిలర్ జయంతి, నాలుగవ వార్డు వైసీపీ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, ఆరవ వార్డు వైసీపీ నాయకులు సురేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆరవ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page