top of page

కడపజిల్లా తెలుగు యువత ఇంచార్జ్ / కోఆర్డినేటర్ గా కె.కె చౌదరి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 19, 2022
  • 1 min read

కడప జిల్లా తెలుగు యువత ఇంచార్జ్ / కోఆర్డినేటర్ గా కె.కె చౌదరి నియామకం - పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి శ్రమిస్తానన్న కె కె.

ree

పార్టీలో వెదగడానికి వయసు తో పని లేదు వారి చేసే సేవ ముఖ్యమని మరోసారి రుజువైంది. నిరంతరం పార్టీ కోసం పని చేసే కె కె చౌదరి కి పార్టీ పెద్దలు మరింత బాధ్యతను అప్పజెప్పారు.

ree

వివరాల్లోకి వెళితే ఈ రోజు ఉదయం టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశానుసారం రాష్ట్ర టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు మరియు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరాం చిన్నబాబు... కడపజిల్లా తెలుగు యువత ఇంచార్జ్/కోర్డినేటర్ గా రైల్వేకోడూరు నియోజవర్గానికి చెందిన కె కె చౌదరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ree

ప్రస్తుతం ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో విద్యార్థి దశ నుంచి దాదాపు 15 సంవత్సరాలు పైగా తెలుగుదేశంపార్టీ విద్యార్థి, యువజన కమిటీలలో సమర్ధవంతంగా పనిచేసిన అనుభవం వున్న కె కె చౌదరిని నేడు నియమించడం జరిగిందని తెలియజేశారు.


కె కె చౌదరి మాట్లాడుతూ... కడపజిల్లా లోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్జ్ లు మరియు యువతని సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాలను, మరియు నిరుద్యోగ, యువత సమస్యల పైన పోరాటాల ద్వారా మరింతగా జిల్లాలో తెలుగుదేశంపార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.


నా పైన నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడుకి, రాష్ట్ర యువత అధ్యక్షులు శ్రీరాం చినబాబుకి, రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డికి, కోడూరు నియోజవర్గ టిడిపి ఇంచార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడుకి, మరియు సహకరించిన తెలుగుదేశంపార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేస్తానని తెలియజేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page