top of page

చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ భారీ ర్యాలీ.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 11, 2023
  • 1 min read

--ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్య.. కేకే చౌదరి.

ree

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ వ్యతిరేకంగా అరెస్టు ఖండిస్తూ రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపుమేరకు సోమవారం రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు కేకే చౌదరి ఆధ్వర్యంలో చిట్వేలి లో తెలుగు తమ్ముళ్లు,జనసైనికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తమ నిరసనలు ప్రకటించారు.

మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి వచ్చి జత కూడిన నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహం దగ్గరనుంచి ర్యాలీ ప్రారంభించి అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లి తిరిగి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు ర్యాలీగా చేరుకున్నారు.ప్రధాన వీధుల్లో వ్యాపార సముదాయాలను 60 శాతం మేర యజమానులు స్వచ్ఛందంగా మూసి వేశారు. తనను జైలుకు పంపాడన్న నెపంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పై కక్షగట్టి కుట్రలు పన్నారని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని, తమ నాయకుడు నిరపరాధిగా వస్తాడని కేకే చౌదరి , టిడిపి పార్టీ సీనియర్ నాయకులు లారీ సుబ్బరాయుడు లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకులు కాకర్ల నాగార్జున,సర్పంచ్ నరసింహ, ఏదోటి రాజశేఖర్ ,బుంగటావుల రాజ, అడ్వకేట్ బాలాజీ,అనంతయ్య, బాలకృష్ణ యాదవ్,రంగయ్య యాదవ్,కందుల నరసింహ నాయుడు, బొంతల నాగేశ్వర, మాదాసు నరసింహ, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు,మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page