top of page

ఈ తీర్పు సార్వత్రిక ఎన్నికలకు నాంది - బత్యాల

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 18, 2023
  • 1 min read

నీతికి., ధర్మానికే పట్టం..

సంబరాలు జరుపుకుంటున్న టిడిపి నాయకులు

ఈ తీర్పు సార్వత్రిక ఎన్నికలకు నాంది ---- బత్యాల


ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ప్రజలు నీతికి ధర్మానికే పట్టం కట్టారని, ఈ ప్రజా తీర్పు రానున్న సార్వత్రిక ఎన్నికలకు నాంది అని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి బత్యాల చెంగల రాయుడు తెలియజేశారు. శాసనమండలి ఎన్నికలలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల విజయంతో కలిపి తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో మూడు స్థానాలలో విజయం సాధించడంతో బత్యాల చెంగల రాయుడు ఆధ్వర్యంలో శనివారం తెలుగు తమ్ముళ్లు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు.

ree

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వరకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చుకుంటూ.. మేళతాళాలతో నృత్యాలు చేసుకుంటూ ఉత్సాహభరితంగా ర్యాలీగా వెళ్లి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

ree

ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కలలుగన్న మూడు రాజధానుల ముచ్చట టిడిపి సాధించిన మూడు శాసనమండలి విజయంతో బంగాళాఖాతంలో కలిసిపోయిందని అన్నారు. అధికార పార్టీ ధనహంకారానికి, దౌర్జన్యాలకు లొంగకుండా ప్రజలు నీతి, నిజాయితీకి పట్టం కట్టారని తెలిపారు. అభివృద్ధి ఆకాంక్షించి ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలకు వారి ఆశయాలను నెరవేర్చేందుకు 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రానున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page