top of page

ప్రొద్దుటూరులో ఘనంగా టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 29, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరులో 40వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో జరుపుకున్నారు. స్థానిక జమ్మలమడుగు బైపాస్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, టీడీపీ జండా ఎగురవేశారు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ రెడ్డి, అనంతరం కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగిన నేపథ్యంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు టీడీపీ పార్టీని 1982లో స్థాపించి నేటికీ 40 సంవత్సరాలు అయిన సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు ముందుగా శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ 40వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న తనకు ఇంకా 40 యేండ్లు నిందలేదని, టీడీపీలో యువతకు పెద్దపీట వేసే దిశగా చంద్రబాబు లోకేష్ వ్యూహరచన చేస్తున్నారని, అందులో భాగంగానే సామాన్య కార్యకర్తగా పార్టీలోకి వచ్చిన తనకు ఈనాడు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారని తెలియచేసారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే నాయకులకు కార్యకర్తలకు ప్రొద్దుటూరులో కొదవలేదని, పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఎందరో నాయకులు కార్యకర్తలు ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీనే నుమ్ముకుని ఉన్నారని వారందరి త్యాగాలు, సేవలు మరువలేనివని కొనియాడారు. రాబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో అలాగే ప్రొద్దుటూరులో టీడీపీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page