ప్రవీణ్ రెడ్డి తిరుమల పాదయాత్ర
- PRASANNA ANDHRA

- Sep 13, 2023
- 1 min read
ప్రవీణ్ రెడ్డి తిరుమల పాదయాత్ర


వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, బాబు త్వరగా బెయిల్ పై విడుదల కావాలని ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి దాదాపు వోంద మంది నాయకులు, కార్యకర్తలతో ప్రొద్దుటూరులోని తన నివాసం నుండి తిరుమలకు బుధవారం ఉదయం పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్రకు సంఘీభావంగా మద్దతు తెలుపుతూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఆయన ఇంటికి వచ్చి తగు సూచనలు సలహాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, ఎల్లవేళలా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి, ప్రజల సమస్యలపై పోరాడుతున్న తమ నాయకుడిని అరెస్టు చేయడం హేయమైన చర్యగా ఆయన భావించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పి అటు నియోజకవర్గంలోనూ ఇటు రాష్ట్రంలోనూ టిడిపి జెండా ఎగురవేసి వైసిపికి తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.














Comments