top of page

రేపు టిడిపి ఫేజ్ 1 మేనిఫెస్టోను విడుదల

  • Writer: EDITOR
    EDITOR
  • May 27, 2023
  • 1 min read

రేపు టిడిపి ఫేజ్ 1 మేనిఫెస్టోను విడుదల..

ree
ree

వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అప్పుడే సన్నద్ధమవుతోంది. ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మేనిఫెస్టోను రేపు విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఎన్నికలు 2024లో వచ్చినా, అంతకు ముందే వచ్చినా సైకిల్ రెడీగా ఉందని అన్నారు.

ree

గత నాలుగేళ్లగా వైసీపీ ప్రభుత్వం ఎంతో వేధిస్తున్నా టీడీపీ కార్యకర్తలు భయపడలేదని, వెనుకంజ వేయలేదని ప్రశంసించారు. దిశ చట్టమే లేకపోయినా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారని సీఎం జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. అమ్మఒడి అనేది నాటకమని, నాన్నబుడ్డి వాస్తవమని ఎద్దేవా చేశారు. జగన్ అక్రమాల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో మహానాడులు అవసరమవుతాయని అన్నారు. జలజీవన్ మిషన్ లో మన రాష్ట్రం 18వ స్థానంలో, ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, అప్పుల్లో తొలి స్థానంలో, విదీశీ పెట్టుబడుల్లో 14వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ సహాయ నిరాకరణ చేశాయని అన్నారు. తిరుమలలో కూడా గంజాయి వ్యాపారం జరగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు..

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page