top of page

కార్యకర్తలే మా పార్టీకి బలం కస్తూరి విశ్వనాథ నాయుడు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 14, 2022
  • 1 min read

కార్యకర్తలు మా పార్టీ అండ

వారి క్షేమమే మా నాయకుని ఆకాంక్ష.


రైల్వే కోడూర్ టీడీపీ ఇంచార్జ్ కస్తూరి.


ree

అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల పరిధిలోని నూతన బస్టాండ్ ఆవరణలో ఈరోజు సాయంత్రం రైల్వేకోడూరు టిడిపి ఇన్చార్జి కస్తూరి విశ్వనాధ నాయుడు పార్టీ కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. తాను మాట్లాడుతూ..


ree

2022-24 కు గాను తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించారు. వంద రూపాయలతో పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం పార్టీ కల్పిస్తుందని తెలియజేశారు. ప్రతి గ్రామము నుంచి సభ్యత్వ నమోదు బాధ్యతలను గ్రామ కమిటీ మరియు మండల కమిటీ మరియు మాజీ /ప్రసుత్త సర్పంచ్ లకు, ఎంపిటిసి లకు అప్పగించారు.కార్యకర్తల బలంతోనే తెలుగుదేశం పార్టీకి నలభై సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు సేవలందిస్తున్నదని, 70 లక్షల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారని అన్నారు.


ree

ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు మరియు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు కె కె చౌదరి, ఓబులవారిపల్లి మండల టిడిపి అధ్యక్షులు వెంకటేశ్వరరాజు, మాజీ జెడ్పిటిసి రమణ యాదవ్, మాజీ ఎంపీటీసీ కట్టా లోకేష్, సర్పంచులు ఈ మద్దిన చంద్రమోహన్, ఎదోటి రాజశేఖర్, రాజంపేట పార్లమెంట్ బిసి నాయకులు నాగయ్య యాదవ్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు వలసాని గుండయ్య యాదవ్, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి అనంతయ్య యాదవ్, మండల టిడిపి నాయకులు ఈ మద్దిన ప్రవీణ్, వెంకటేశ్వర రాజు, కొండపనేని సుబ్బరాయుడు, పార్లమెంట్ ఎస్సీసెల్ నాయకుడు కె ఈశ్వరయ్య, పార్లమెంట్ యువత నాయకులు బాలక్రిష్ణ యాదవ్, మండల మైనార్టీ నాయకులు కరీం భాష, గూడూరు నాగరాజు, దుగ్గిన ఈశ్వరయ్య, దుగ్గిన వెంకటయ్య, కట్టా హరికృష్ణ, పవన్ యాదవ్, రామ చంద్ర యాదవ్, నరసింహ రాయల్, మండల యువత నాయకులు నందల లోకేష్, ఏదోటి సందీప్ మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page