శోభాయమానంగా శ్రీనివాస శోభాయాత్ర
- MD & CEO

- 2 hours ago
- 1 min read
శోభాయమానంగా శ్రీనివాస శోభాయాత్ర

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు పట్టణంలో ఈరోజు శ్రీనివాస స్వామి వారి శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఉదయం ఆర్టీసీ బస్టాండ్ నుంచి మున్సిపల్ హై స్కూల్ మైదానం వరకు నిర్వహించిన శోభాయాత్రలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని కోలాట నృత్యాలతో ఆకట్టుకున్నారు. భజన బృందాలు, తప్పెట్లు, స్వామి వేషధారణలతో శోభాయాత్ర భక్తిమయంగా సాగింది. అనంతరం మున్సిపల్ హై స్కూల్ మైదానంలో సాయంకాలం వేదమంత్రోచ్చారణలు, అన్నమాచార్య సంకీర్తనలతో శ్రీనివాస స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
ప్రొద్దుటూరు పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానముల వారి నేతృత్వంలో శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సప్తశైల వాసుడైన శ్రీపతి శ్రీ శ్రీనివాస స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం మైదుకూరు రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మున్సిపల్ హై స్కూల్ మైదానం వరకు శోభాయాత్ర సాగింది. నాలుగు వృషభరాజములు, నాలుగు అశ్వములు, భజన బృందాలు, మహిళల కోలాట నృత్యాలతో శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం సాయంత్రం మున్సిపల్ హై స్కూల్ మైదానంలో వేదమంత్రోచ్చారణలు, అన్నమాచార్య సంకీర్తనలతో స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదం, అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు.








Comments