ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం
- MD & CEO

- 8 minutes ago
- 1 min read
ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరులోని పెన్నా నది తీరాన వెలసిన అయ్యప్ప స్వామి ఆలయం నుంచి ప్రొద్దుటూరు పురవీధులలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని అయ్యప్ప స్వామి భక్తులు భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు స్వామివారి బ్రహ్మోత్సవాన్ని అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సర్కిల్ వరకు మేల తాళాలతో ఊరేగింపుగా నిర్వహించారు. స్వామి వారి ఊరేగింపులో దేవతామూర్తుల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేరళ సింగారి మేళం, మంగళ వాయిద్యాల మధ్య అయ్యప్ప స్వాములు అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. స్వామివారి రథం ముందు వేలాదిగా మహిళలు దీపాలు చేతబట్టుకొని స్వామివారి ఊరేగింపుతో నడుస్తూ అయ్యప్ప భజనలు, సంకీర్తనలు, శరణుగోష చేస్తూ అయ్యప్పను స్తుతిస్తూ ఆరాధించారు.








Comments