పార్టీనే ఒక వర్గం కుటుంబం లాంటిది - ప్రవీణ్
- PRASANNA ANDHRA

- Apr 26, 2024
- 1 min read
పార్టీనే ఒక వర్గం కుటుంబం లాంటిది - ప్రవీణ్


కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ టిడిపికి ఓటు వేయాలని, పార్టీలో వర్గాలు వర్గ విభేదాలు లేవని, టిడిపి పార్టీ అనేదే ఒక వర్గమని, పార్టీ కుటుంబం లాంటిదని జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు టిడిపి పట్టణ అధ్యక్షులు జబీపుల్లా ఆధ్వర్యంలో మున్సిపల్ 22వ వార్డు హైదర్ ఖాన్ వీధి నందు నూతన టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించారు ప్రొద్దుటూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి, కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి, టిడిపి ఇంచార్జి జివీ ప్రవీణ్ కుమార్ రెడ్డి.

పలువురు కీలక ముఖ్య నేతలు హాజరైన ఈ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని, అనుభవజ్ఞుడైన బాబు, యువ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం పురోగతివైపు అడుగు వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఒక సైనికుడిగా పనిచేసి టిడిపిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తన వెంట నడిచి ఇబ్బంది పడ్డ నాయకులకు కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి నాయకులతో చంద్రబాబు చర్చించారని, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం రాగానే ఇక్కడి నేతలకు సముచిత స్థానం గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు, కావున ఇక్కడి నాయకులు కలిసి పని చేయాలని కోరారు. ఉమ్మడి కడప జిల్లాలో మెజారిటీ స్థానాలు టిడిపి కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి టిడిపి నాయకులు నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుత టిడిపి పట్టణ అధ్యక్షులు జెబీవుల్ల నేడు టిడిపి కార్యాలయం ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమని, జెబీవుల్ల తన నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు వచ్చిన సందర్భంగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు సాదర స్వాగతం పలుకుతూ, జెబీవుల్ల రాకతో టిడిపి లాభపడుతుందని అన్నారు. కార్యక్రమంలో నంద్యాల రాఘవరెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి, కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, పలువురు టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు.









Comments