top of page

సీఎం వైయస్ జగన్ తో భేటీకి టిడిపి ప్రతినిధుల బృందం!

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 7, 2022
  • 1 min read
సీఎం వైయస్ జగన్ తో భేటీకి టిడిపి ప్రతినిధుల బృందం!

ఎమ్మెల్సీ బీటెక్ రవి హౌస్ అరెస్ట్

పోలీసులతో చర్చించిన అనంతరం సీఎం వద్దకు టిడిపి ప్రతినిధుల బృందం!!

ree

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన పురస్కరించుకొని ఆయనను కలసి పులివెందుల రైతాంగ సమస్యలను వివరించేందుకు టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి గురువారం సింహాద్రిపురం లోనీ తన స్వగృహం నుంచి పులివెందులకు బయలుదేరారు. అయితే అంతకుమునుపే పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకొని బీటెక్ రవిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీటెక్ రవి తాము రైతు సమస్యల కోసమే ముఖ్యమంత్రిని కలవాలని వెళుతున్నామని తమకు అధికారులు అనుమతిని ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో పోలీసు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లగా వారు టిడిపి కి చెందిన ఐదు మందితో ఒక బృందం మీడియా ద్వారా ముఖ్యమంత్రి తో కలిసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ బీటెక్ రవి విడుదల చేసిన ఒక ప్రకటనలో మాట్లాడుతూ టీడీపీ తరఫున రైతు సమస్యలను మాట్లాడేందుకు పులివెందుల నియోజకవర్గంలోని బ్రాహ్మణ పల్లెకు చెందిన వెంకటరామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవరెడ్డి, జయ భరత్ కుమార్ రెడ్డి , గుణకం పల్లె అమర్ ,బొజ్జాయిపల్లె రాజేశ్వర్ రెడ్డిలను ముఖ్యమంత్రి వద్దకు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page