మున్సిపల్ పెట్రోల్ పంపులో కోట్ల రూపాయల అవినీతి - టిడిపి నాయకులు
- EDITOR

- 2 days ago
- 1 min read
మున్సిపల్ పెట్రోల్ పంపులో కోట్ల రూపాయల అవినీతి - టిడిపి నాయకులు

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఈరోజు ప్రొద్దుటూరు టిడిపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు చల్ల రాజగోపాల్ యాదవ్, కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రొద్దుటూరు మునిసిపల్ పెట్రోల్ పంపు ద్వారా గత కొంతకాలంగా జరిగిన అక్రమాలు బయటపడ్డాయని అన్నారు. 2021–22 నుండి ఇప్పటి వరకు సుమారు ₹1 కోటి 30 లక్షల రూపాయల డబ్బు లావాదేవీల తేడా ఉన్నప్పటికీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి సహా వైసిపి నాయకులు నోరు కూడా కదపలేదని విమర్శించారు. సాధారణ కార్యకర్త ఒక చిన్న వివాదం జరిగినా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించే వైసిపి నాయకులు ఇంత పెద్ద ఆర్థిక బకాయిలు బయటపడినా నిశ్శబ్దంగా ఉండటం దారుణమని ఆరోపించారు. ప్రభుత్వ నిధులు, పన్ను చెల్లింపుదారుల డబ్బు తేడాపై ప్రజలకు జవాబు చెప్పాలని మున్సిపల్ నిర్వహణలో జరిగిన అవినీతి అంశంపై అధికార పార్టీ బాధ్యత వహించాలన్నారు.

అనంతరం మున్సిపల్ ఐదవ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ఎక్కడ చూసినా ప్రామాణికత, పారదర్శకత గురించి మాట్లాడుతున్నారని, ఒక పంచాయతీ వ్యవహారంలో 20 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు చేయడం పూర్తిగా తప్పుడు ప్రచారమని మురళి ఖండించారు. తనపై ఎలాంటి ఆరోపణలైనా ప్రజల ముందు మీడియా సాక్షిగా ప్రమాణానికి సిద్ధమని స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్, సిరిపురి కాంప్లెక్స్ వేలం పాట్లలో జరిగిన అవకతవకలు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయో వాటిపై కూడా వైస్ చైర్మన్ బంగారు రెడ్డి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి పదవి, డబ్బు రాజకీయాలే వైసిపి నేతల అసలు లక్ష్యమని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైసిపికి తగిన గుణపాఠం చెప్తారని మురళి హెచ్చరించారు.








Comments