టిడిపి నుండి వైసీపీ లో చేరిన 300 కుటుంబాలు
- PRASANNA ANDHRA

- Feb 11, 2024
- 1 min read
టిడిపి నుండి వైసీపీ లో చేరిన 300 కుటుంబాలు


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆదివారం ఉదయం స్థానిక ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మత్స్య నందు గల ఎన్జీఓ కాలనీలో లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ వేంపల్లి సురేంద్ర నాథ్ రెడ్డి(సూరి), అలాగే ఆయన అనుచరులు దాదాపు 300 కుటుంబాలతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో ఆయన చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకొని టిడిపి నుండి వైసీపీ లో చేరడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైసీపీ సీనియర్ నాయకుడు కొవ్వూరు రమేష్ రెడ్డి, జిల్లా జెసిఎస్ కోఆర్డినేటర్ కల్లూరు నాగేంద్రారెడ్డి, కౌన్సిలర్ లు వరికూటి ఓబుల్ రెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, మరికొందరు వైసీపీ ముఖ్య నాయకులు, పెద్దయెత్తున ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
To watch this video Click Here













Comments