top of page

నేను టీడీపీ తీర్ధం పుచ్చుకోలేదు - బంట్రోతు ఈశ్వరయ్య

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 3, 2023
  • 1 min read
ree

అన్నమయ్య జిల్లా, రాజంపేట


జనసేన యువనాయకుడు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు అంటూ వచ్చిన అసత్య ప్రచారాలను నమ్మవద్దు అని శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నందలూరు మండలం, టంగుటూరు పంచాయతీ జనసేన యువనాయకుడు బంట్రోతు ఈశ్వరయ్య, పలువురు జనసేన కీలక కార్యకర్తల ఆవేదన. పార్టీ ఫిరాయింపు అంటూ పలు వార్తా పత్రికల్లో ప్రచురించిన కథనాలను ఆయన ఖండించారు. మాజీ ఎమ్యెల్సీ, రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బత్యాల చంగలరాయుడు సమక్షంలో తాను టీడీపీ చేరినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని, మిత్రుల కోరిక మేరకు తాను బత్యాలను మర్యాదపూర్వకంగా కలిసినట్లు వెల్లడించారు. ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబెర్ గురువిగారి వాసు అధ్యక్షతన రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, అలాంటి తమపై పార్టీ ఫిరాయింపు వార్తలు ప్రచురించటంపై ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని, రాబోవు ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారం చేపట్టనున్నదని ఆయన జోస్యం చెప్పారు. ఇకనైనా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితువు పలికారు. కార్యక్రమంలో గురువిగారి వాసు, పలువురు జనసేన కీలక కార్యకర్తలు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page