150 కోట్లకు టాక్స్ చూపించారా? టిడిపి ఇంచార్జి ప్రవీణ్ రెడ్డి సూటి ప్రశ్న?
- PRASANNA ANDHRA

- Dec 8, 2023
- 1 min read
150 కోట్లకు టాక్స్ చూపించారా?
టిడిపి ఇంచార్జి ప్రవీణ్ రెడ్డి సూటి ప్రశ్న?

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనకు తన కుటుంబ సభ్యులకు గల మొత్తం ఆస్తి 150 కోట్లు అని వెల్లడించిన నేపథ్యంలో, ఆర్జించిన ఆస్తులకు ఇన్కమ్ టాక్స్ కట్టారా? రిటర్న్స్ ఫైల్ చేశారా? 150 కోట్లు ఎలా వచ్చాయి? అంటూ ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు? శుక్రవారం మధ్యాహ్నం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరు గురించి తాను విమర్శలు చేస్తుంటే ఎమ్మెల్యే రాచమల్లు తన ఆస్తులను వెల్లడిస్తున్నారని ఇది ప్రజలను మభ్యపెట్టే డైవర్షన్ పాలిటిక్స్ అని పేర్కొన్నారు. గడచిన ఎన్నికలలో తన ఆస్తి ఒక కోటి 20 లక్షల రూపాయలు అని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న ఎమ్మెల్యే రాచమల్లు రెండున్నర సంవత్సర కాలంలో 150 కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు? 150 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన టాక్స్ ఫైలింగ్ ఇన్ఫర్మేషన్ ను పాత్రికేయులకు వెల్లడించాలని బహిరంగ సవాల్ విసిరారు. రానున్నది టిడిపి ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఆఫీసర్ ని నియమించి ఎమ్మెల్యే అక్రమాలను బయటపెడతానని అన్నారు. ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే గా తనను రానున్న ఎన్నికలలో ప్రజలు గెలిపిస్తే తనకున్న విజన్ ద్వారా ప్రొద్దుటూరులో శాంతియుత వాతావరణం కల్పించి, అభివృద్ధి చేస్తానని అన్నారు. తన విజన్ ఏమిటో రానున్న ఎన్నికల సమయంలో ప్రజల ముందు ఉంచుతానని ఆయన అన్నారు.









Comments