top of page

5, 39వ వార్డులలో టిడిపి ఎన్నికల ప్రచారం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 24, 2024
  • 1 min read

Updated: Apr 26, 2024

5, 39వ వార్డులలో టిడిపి ఎన్నికల ప్రచారం

ree
39 వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న వరద
ree
ఐదో వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న రాఘవరెడ్డి
ree

కడప జిల్లా, ప్రొద్దుటూరు


టిడిపి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం స్థానిక మున్సిపల్ ఐదవ వార్డు అలాగే 39 వ వార్డులలో ఎన్నికల ప్రచారాలు నిర్వహించడం అయినది. 39వ వార్డు నందు చెంగా సిద్దయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొనగా, ఐదో వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రచారంలో నంద్యాల రాఘవరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ 6 పథకాలను వార్డులలోని ప్రజలకు వివరించి కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి ప్రజలు ఓట్లు వేసి ఆదరించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పలువురు క్రియాశీలక టిడిపి నాయకులు వి ఎస్ ముక్తీయారు, మాజీ జడ్పిటిసి వెళ్లాల భాస్కర్, బద్వేలు శ్రీనివాసుల రెడ్డి, బొర్రా రామాంజనేయులు, చిలకల కృష్ణారెడ్డి, పొట్టు లక్ష్మిరెడ్డి, పగిడాల దస్తగిరి, సాకం నాగేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు షేక్ మునీర్, మహమ్మద్ గౌస్, వంగల నారాయణరెడ్డి, కామిశెట్టి బాబు, వేణు, సానా విజయభాస్కర్ రెడ్డి, సుబ్బిరెడ్డి, బిజెపి నాయకులు నరేంద్ర, పాతకోట రాఘవేంద్రారెడ్డి, శివ నాగిరెడ్డి, ఎస్ ఆర్ చిన్న, కుమారి, అఖిల, హరికృష్ణ, మల్లికార్జున, జనసేన నాయకులు జిలాన్, క్రియాశీలక కార్యకర్తలు, వార్డులలోని ప్రజలు పాల్గొన్నారు.

ree

ree
ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page