top of page

'జగన్ పాలనలో బాదుడే బాదుడు' అంటూ టీడీపీ కరపత్రాల పంపిణీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 12, 2022
  • 1 min read

ప్రొద్దటూరు, ప్రసన్న ఆంధ్ర వార్త


వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దటూరు మునిసిపల్ 10,11వ వార్డులలో నేడు టీడీపీ ఆధ్వర్యం 'జగన్ పాలనలో బాదుడే బాదుడు' అంటూ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచారు స్థానిక టీడీపీ నాయకులు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి వార్డులోని ప్రజలతో మాట్లాడుతూ, రాష్ట్రంలో నేడు నెలకొన్న పరిస్థితులను వివరించారు, ప్రజలు కూడా వారి సమస్యలను టీడీపీ నేతలకు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచటంతో పాటు, అప్రకటిత విద్యుత్ కోతలు కూడా విధిస్తోందని, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, గతంతో పోలిస్తే నిత్యావసర ధరలు అమాంతం పెంచేశారని, వివిధ రకాల పన్నుల పేరుతో ప్రజలను బాదుతున్నారని, పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం ఆకాశాన్నంటాయని వీటి ధరలు పెరగటం వలన వాహన రంగం, వ్యవసాయానికి అధిక మొత్తంలో ప్రజలు రైతులు డబ్బులు వ్యచ్చించాల్సి వస్తోందని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుక నేడు వేల రూపాయలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.

ree

ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి ముక్తియార్, నియోజకవర్గ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు ఈ.వి సుధాకర్ రెడ్డి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నల్లబోతుల నాగరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page