top of page

చిట్వేలు లో ఘనంగా టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 29, 2022
  • 1 min read

చిట్వేలు లో ఘనంగా టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - బడుగు, బలహీనవర్గాల పార్టీ నే టిడిపి: కేకే చౌదరి.

ree

ఈరోజు చిట్వేలి నందు తెలుగుదేశంపార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు కె కె చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి 40వ వసంతాల కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం మహనీయులైన దివంగత నేత నందమూరి తారక రామారావు ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అధ్యక్షతన అనతికాలంలోనే అధికారాన్ని చేపట్టి పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అన్నింటిలోనూ సమాన హోదాను కల్పిస్తూ అందరికీ మేలు చేసే పార్టీగా అందరి మదిలో స్థానాన్ని పొందిందని అట్టి ఘనత పొందిన ఎన్టీఆర్ ఎప్పటికీ చిరస్మరణీయులని వారన్నారు.

ree

చంద్రబాబు అధ్యక్షతన మహిళ సాధికారతను,సాంకేతిక రంగంలో, రాజధాని నిర్మాణంలో ప్రత్యేకతను సంతరించుకున్న టిడిపి తిరిగి 2024 ఎన్నికల్లో విజయం సాధించి పూర్వవైభవం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు పెరుగు వెంకట సుబ్బయ్య, సర్పంచ్ ఏదోటి రాజా, మాజీ ఎంపిటిసి లోకేష్, మించల బాలకృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు రాజు, మాచిన సుధాకర్ నాయుడు,దుగ్గిన ఈశ్వరయ్య,మాచిన రవీంద్ర, కందుల నరసింహనాయుడు, పెరుగు వెంకటేష్, కాకర్ల కోటేశ్వర, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page